పారిశుద్ధ్య కార్మికురాలికి ఘన సన్మానం

పారిశుద్ధ్య కార్మికురాలికి ఘన సన్మానం

NLG: దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనంలో సోమవారం జరిగిన సమావేశంలో మహిళా దినోత్సవం సందర్బంగా పారిశుద్ధ్య కార్మికురాలు యాదమ్మను విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజంగా సేవ అంటే పారిశుద్ధ్య కార్మికులదే అని వారి సేవలను గుర్తు చేశారు. దేవరకొండ ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.