ఎడ్ల పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ
PLD: కారంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరుల ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న వీరుల ఉత్సవాలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. పందాల్లో పాల్గొన్న ఎద్దుల యజమానులు, రైతులను ఆయన అభినందించారు.