మానుకోటలో ముగిసిన ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గత వారం రోజులుగా నిర్వహించిన ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. ఇట్టి ముగింపు కార్యక్రమంకు డీఎస్పీ తిరుపతిరావు హాజరై శిక్షణ పొందిన క్రీడాకారులను అభినందించారు. గ్రామీణ ప్రాంత యువత క్రీడలలో రాణించి జాతీయ- అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు.