ఏప్రిల్ 2న తాండూరులో హనుమాన్ శోభాయాత్ర

ఏప్రిల్ 2న తాండూరులో హనుమాన్ శోభాయాత్ర

VKB: తాండూరులో ఏప్రిల్ 2న హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకుని హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. సా.4 గంటలకు రైల్వే స్టేషన్ హనుమాన్ ఆలయం వద్ద ప్రారంభమై.. భద్రేశ్వర గుడి, గాంధీచౌక్, వినాయక చౌక్, శాంత్ మహల్ థియేటర్ మీదుగా యాత్ర సాగనుంది. భక్తులు భారీగా విచ్చేసి ఈ వేడుకను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ కోరింది. భక్తులతో తాండూరు పురవీధులు కేసరిమయంగా మారనున్నాయి.