VIDEO: మంత్రాలయంలో ప్రజా వేదికకు 18 అర్జీలు
KRNL: మంత్రాలయం ఎమ్మార్వో కార్యాలయంలో తహశీల్దార్ రమాదేవి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మండలంలోని ప్రజలకు భూ సమస్యలతో పాటు ఏవైనా సమస్యలు ఉంటే అర్జీల రూపంలో వినతులు ఇస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 18 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. ఇందులో తహశీల్దారుతో పాటు ఎంపీడీవో నూర్జహాన్, ఆర్ఐ జనార్దన్ స్వామి, వీఆర్వో తదితరులు ఉన్నారు.