కేరళలో 'కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ': వైష్ణవ్
కేరళలోని కమ్యూనిస్ట్, కాంగ్రెస్ కలిసి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ(CCP)గా మారాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఎద్దేవా చేశారు. ఇరు పార్టీలు కలిసి కేరళలో ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల 106 ROB RUBల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 1900 కోట్లు విడుదల చేసినా పురోగతి లేదని తెలిపారు.