576 కర్నాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం

576 కర్నాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం

KRNL: కోసిగి మండలంలోని కందుకూరు నుంచి అగసనూరుకు వెళ్లే రహదారిలో కడిదొడ్డి క్రాస్ వద్ద కర్నాటక మద్యాన్ని ఆర్లబండకి చెందిన ఉసేని బైక్‌లో తరలిస్తుండగా దాడి చేసినట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఉసేని నుంచి 576 కర్నాటక ఒరిజినల్ చాయిస్ 90 ఎంఎల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ రూ. 38,800 ఉన్నట్లు తెలిపారు.