మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసులు రక్తదానం
VZM: మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఇవాళ బొబ్బిలి పట్టణంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ నారాయణరావు నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో పోలీసు సిబ్బంది, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, రక్త దానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.