పట్టాభి రామస్వామి ఆలయంలో భక్తుల పూజలు

పట్టాభి రామస్వామి ఆలయంలో భక్తుల పూజలు

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా బద్వేల్ రోడ్‌లో ఉన్న పట్టాభిరామ స్వామి గుడిలో ఇవాళ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆలయంకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. పూజారులు వారికి గోత్రనామాలతో అర్చనలు చేసి ప్రసాదాలను అందజేస్తున్నారు. స్వామివారి కళ్యాణాన్ని వచ్చిన భక్తులు తిలకించి వెళ్లవలసిందిగా పూజారులు విజ్ఞప్తి చేశారు.