ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

KNR: హుజురాబాద్ డివిజన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అండ్ ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన ప్రజలే ఏ దేశానికైనా వెన్నెముకని అన్నారు. దేశంలో ప్రజలు వయస్సుతో నిమిత్తం లేకుండా అనారోగ్యం పాలవుతున్నారని, వైద్యం, శస్త్రచికిత్సల, ఆర్థిక భారం తప్పడం లేదన్నారు.