సీతారాముల కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
KDP: ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండ రామాలయంలో రేపు సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ప్రపంచంలో రాత్రివేళ సీతారాముల కళ్యాణం జరిగే ఏకైక క్షేత్రం ఇదే. ఈ కళ్యాణానికి TTD ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు కూర్చునేందుకు 121 గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. 2,100 పోలీసులతో బందోబస్తు చేయనున్నారు.