జిల్లాలో పడిపోయిన అరటి ధరలు
CTR: అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ. లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.