కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

KDP: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ గొప్పలు చెప్పుకొని, జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రాచమల్లు మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడపిల్లలైనా కాలేజీలు, షాపింగ్‌లకు వెళితే భద్రంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.