హెగ్డోలి సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

హెగ్డోలి సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

NZB: పోతంగల్ మండలం హెగ్డోలి సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో హెగ్డోలి ప్రజలు వాసు బాబు వైపు మొగ్గు చూపారు. మొత్తం సర్పంచ్ బరిలో ఐదుగురు నిలవగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి అత్యధికంగా ఓట్లు పోలవ్వడంతో వాసు బాబు సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. పార్టీ శ్రేణులు తన అభిమానులు సంబరాలు నిర్వహించారు.