'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

VKB: వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట, వెంకటేశ్వర నగర్ కాలనీలలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పర్యటించారు. డెంగ్యూ బారిన పడిన ఇళ్లను ఆయన పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, ఈగలు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు.