ఆర్చరీ శిక్షణా కేంద్రానికి రికర్వ్ విల్లు అందించిన కలెక్టర్

BDK: పాల్వంచ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ఉచిత ఆర్చరీ శిక్షణా కేంద్రానికి రూ.3.50 లక్షల విలువైన రికర్వ్ విల్లును జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రియాంక అల చేతుల మీదుగా ఆర్చరీ కోచ్ కల్యాణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ పరికరాలను ఉపయోగించుకుని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలన్నారు.