CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
E.G: నిరుపేదలకు CMRF కొండంత అండగా నిలుస్తుందని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.16.60 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అలాగే, మరో ఆరుగురికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.12.47 లక్షల LOC పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.