నూజివీడులో గూడ్స్ షెడ్ నిర్మాణానికి కసరత్తు
కృష్ణా: హనుమాన్ జంక్షన్ నూజివీడు రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ రూ. 14.90 కోట్లతో గూడ్స్ షెడ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. డీఈ వెంకటేశ్వరరావు నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్షించారు. 460 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నూతన షెడ్ నిర్మించడంతో పాటు, గూడ్స్ ప్లాట్‌ఫామ్‌ను ఆధునీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.