బొలెరో ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

కడప: మదనపల్లె మండలం, సీటీఎం వద్ద బొలెరో బైకును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు బైకులో వస్తుండగా శనివారం సీటీఎం నేతాజీ కాలనీ వద్ద బొలెరో ఢీ కొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కర్ణాటక యువకులను వెంటనే 108లో మదనపల్లెకు తరలించారు.