VIDEO: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం గ్రామంలో రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తితో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.