'చెరువు భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి'

KKD: చెరువు భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాలు తిమ్మాపురానికి చెందిన బచ్చల రాజు కోరారు. సోమవారం MPDO డి. శ్రీలలితకు వినతి పత్రం అందజేశారు. వాలు తిమ్మాపురంలో సర్వే నంబర్ 118 గల చిన్న తమ్మయ్య చెరువు గర్భం భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను తొలగించడంలో ఇరిగేషన్ నిర్లక్ష్యం వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.