VIDEO: ఏ. కొండూరులో గ్యాస్ లీక్.. దగ్ధమైన ఇల్లు

VIDEO: ఏ. కొండూరులో గ్యాస్ లీక్.. దగ్ధమైన ఇల్లు

NTR: ఏ. కొండూరు తండాలో గ్యాస్ లీక్ కారణంగా ఇల్లు దగ్ధమైంది. ప్రాణాలతో సురక్షితంగా భూక్య గోపి కుటుంబ సభ్యులు బయటపడ్డారు. వివాహం కోసమని బీరువాలో ఉంచిన రూ. 4.50లక్షల నగదుతో పాటు బంగారు, వెండి వస్తువులు కాలి బూడదయింది. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారని స్థానికులు తెలిపారు.