'మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి'
KRNL: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రతీ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి సూచించారు. విద్యార్థుల 10వ తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించడానికి ఈ సమావేశం కీలకమని ఆమె పేర్కొన్నారు. విద్యా ప్రగతి, 100 రోజుల ప్రణాళిక, మధ్యాహ్న భోజనం నాణ్యత వంటి అంశాలు చర్చించాల్సిందిగా ఆదేశించారు.