భారీ వర్షం.. నిలిచిన రవాణా సేవలు

MLG: ఏటూరునాగారం మండలం రాంపూర్ గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మామిడి వాగు ఉప్పొంగడంతో రాంపూర్ వాసులకు రవాణా సేవలు నిలిచిపోయాయి. ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి మంజుల బుధవారం తెలిపారు. చేపల వేటకు, వ్యవసాయ పనులకు ఎవరూ వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.