VIDEO: ఘనంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు
JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీరాముల పల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.