'లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి'
SRCL: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటుండగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు.