ఆ హక్కు భారత్‌కు ఉంది: జైశంకర్
ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండకూడదని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. ఉగ్రవాదాన్ని సహించకూడదని.. సమర్థవంతంగా ఎదుర్కొవాలని పేర్కొన్నారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం రాజీలేని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.