రోడ్డు ప్రమాదంలో స్పందించిన అధికారులు
PPM: కొమరాడ మండలం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని డీ.సీ.హెచ్.ఎస్.సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. తీవ్రగాయాలైన ఇద్దరు క్షతగాత్రులను విశాఖ కే.జీ.హెచ్‌కు తరలించారు.