ఏపీజీబీ బ్యాంక్‌కు నూతన మేనేజర్

ఏపీజీబీ బ్యాంక్‌కు నూతన మేనేజర్

KRNL: వెల్దుర్తి ఏపీజీబీ బ్యాంకు కొత్త మేనేజర్‌గా డి.ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన విజయ భాస్కర్ రెడ్డి కర్నూల్ రీజనల్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నుంచి ఆంజనేయులు వెల్దుర్తికి బదిలీ అయ్యారని తెలిపారు. గురువారం సహచర సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఖాతాదారులు సహకరించాలని ఆయన కోరారు.