ప్రజల సమస్యలే ప్రాధాన్యం: టీడీపీ ఇన్‌ఛార్జి
KRNL: ఆలూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. ఇవాళ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించి వినతిపత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విని, సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా పరిష్కారం చూపుతానన్నారు.