పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి: కమిషనర్
KDP: పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి మున్సిపల్, సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై కమిషనర్ సమావేశం నిర్వహించారు. గత వారంలో ఆస్థి పన్ను రూ. 54.5 లక్షలు, నీటి పన్ను రూ. 11.5 లక్షలు వసూలైందన్నారు. మార్చి చివరినాటికి వంద శాతం పన్నులు వసూలు చేయాలన్నారు.