నూతన SPను సన్మానించిన MRPS, MSP నేతలు
BHPL: జిల్లా నూతన SPగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సిరి శెట్టి సంకీర్త్ గౌడ్‌ను మంగళవారం MRPS, MSP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SPను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో MRPS, MSP రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాదిగ, BHPL నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బిక్షపతి మాదిగ తదితరులు ఉన్నారు.