బేతనికాలనీలో పల్లెనిద్ర కార్యక్రమం

బేతనికాలనీలో పల్లెనిద్ర కార్యక్రమం

బాపట్ల పట్టణంలోని బేతనికాలనీలో శుక్రవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై షేక్ నస్రీన్ స్థానికులతో మాట్లాడి ప్రాంత సమస్యలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంచి నేరాల నియంత్రణే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.