రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
TPT: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై వకుల మాత గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహదారునడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పుదిపట్ల గ్రామానికి చెందిన యుగంధర్ చౌదరి (53)గా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.