'మైనార్టీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'

KMM: నిరుపేద ముస్లిం మైనార్టీల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లీం మైనార్టీ సంస్థ ఫౌండర్ సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. మైనార్టీల సమస్యలపై గురువారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందించారు. వక్ఫ్ భూములను అర్హులైన నిరుపేద ముస్లీం మైనార్టీలకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు.