'12న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలి'
ప్రకాశం: అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శనివారం వెలిగండ్ల మహిళా శిశు సంక్షేమ కార్యాలయం వద్ద సీఐటీయూ అధ్యక్షులు రాధమ్మ నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలపై ఈనెల 12న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మహిళా శిక్షణ సేమ కార్యాలయంలో అందజేశారు.