కర్రలతో దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

TPT: పెళ్లకూరు మండలం నందిమాల గ్రామానికి చెందిన మూలపూడి మునిరాజా అనే వ్యక్తిపై శనివారం సాయంత్రం దుండగులు కర్రలతో దాడి చేశారు. గ్రామంలో కర్రలతో హల్‌చల్ చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు. నల్లగుంట కండ్రిగ గ్రామానికి చెందిన శ్రీను, కృష్ణయ్య, లక్ష్మణ్ దాడి చేసినట్లు గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.