ఎక్లాస్‌పూర్ సర్పంచ్‌గా హనుమంత్ రెడ్డి విజయం
NRPT: మరికల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హనుమంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారుపై ఆయన 260 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హనుమంత్ రెడ్డికి 529 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతుదారుకి 269 ఓట్లు వచ్చాయి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.