VIDEO: మానేరులో తగ్గుతున్న నీటిమట్టంతో పట్టణ వాసుల్లో ఆందోళన
KNR: రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండగా మానేరు రిజర్వాయర్లో నీటిమట్టం ఆందోళన కలిగిస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం ఐదు టీఎంసీలకు పైగా మాత్రమే మిగిలి ఉంది. అందులో రెండు టీఎంసీలు డెడ్ స్టోరేజీకి వెళ్తే, మరో మూడు టీఎంసీలు మాత్రమే తాగునీటికి అందుబాటులో ఉన్నాయి. దీంతో డే బై డే సరఫరా చేస్తున్నారు. నీటిమట్టం తగ్గడంతో ఆందోళనకు గురవుతున్నారు,