చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర
BHPL: రేగొండ రైతు వేదికలో రేగొండ, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.