గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల గోడ పత్రిక ఆవిష్కరణ
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల గోడ పత్రికలను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆవిష్కరించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 29 వరకు జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు తెలిపారు. పశుగ్రాసం, నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని అరికట్టేందుకు పశుపోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.