కారేపల్లి పీహెచ్‌సీలో డీఎంహెచ్ ఆకస్మిక తనిఖీ

కారేపల్లి పీహెచ్‌సీలో డీఎంహెచ్ ఆకస్మిక తనిఖీ

KMM: కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. రామారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్ విభాగాలను సందర్శించి మందుల నిల్వలను తనిఖీ చేశారు.