మార్కెట్ యార్డులో చలివేంద్రం ప్రారంభం
నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని మంత్రి ఫరూక్ సోమవారం ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవి ముగిసే వరకు రైతులు, ప్రజలకు ప్రతిరోజూ చల్లటి నీరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.