బాబాపూర్‌లో ఉపాధి హామీ పనులకు శ్రీకారం
ADB: ఉట్నూర్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలో మంగళవారం సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. వ్యవసాయ భూముల్లో మట్టి కాలువల తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కూలికి పని కల్పిస్తూ, రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.