పాలేరు జలాశయాన్ని సందర్శించిన ఐబీ ఎస్ఈ

పాలేరు జలాశయాన్ని సందర్శించిన ఐబీ ఎస్ఈ

KMM: కూసుమంచి మండలం పాలేరు జలాశయాన్ని మంగళవారం నీటి పారుదల శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు సందర్శించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పాలేరు జలాశయం అలుగు పారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంత నీరు పాలేరుకు ఇన్‌ఫ్లోగా వస్తుందని అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.