నందివాడలో ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ శిక్షణ
కృష్ణా: ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ శిక్షణ నందివాడ మండలంలో ప్రారంభంకావడం సంతోషకరమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకొని దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.