వాలీబాల్, కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం

వాలీబాల్, కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం

NGKL: లింగాల మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో వాలీబాల్, కబడ్డీ శిక్షణ శిబిరాన్ని ఉపసర్పంచ్ V. వీరస్వామి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవులో ఈ శిక్షణ శిబిరాన్ని ప్రతి ఒక్క యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోచ్‌‌లు నేర్పించే మెలకువలను నేర్చుకుని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.