పారిశ్రామికవాడ ఏర్పాటుకు స్థలం ఎంపిక

SKLM: పలాస ప్రాంతంలో నూతన పారిశ్రామికవాడ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఈనెలలో భూమి పూజ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఏపీఐఐసీ అధికారులు ఇటీవల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో చర్చించారు.