నిర్మల్ రైతులకు ఊరట
NRML: నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డుల్లో తొలి విడతలో కేంద్రాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే జొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.