ఇబ్రహీంపట్నంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి శివారులోని నిమ్రా కాలేజీ వద్ద గురువారం ట్రాఫిక్ ఆర్ఎస్ఐ లక్ష్మణరావు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలను కలిగి ఉండాలన్నారు.